Posts

Showing posts from 2019

మమతలన్నీ దూలమైతే

మమతలన్నీ దూరమైతే మనసు గతి ఇంకేమిటి మనసు వెతలో మలిగిపోతే మనిషి బ్రతుకింకేమిటి చినుకు పడని నేలలో తరువు చిగురులు కాచునా కునుకు పడనీ కనులలో కలలు పండుగ చేయునా ఆశ అడియాశగా మారి మిగిలిపోయే వేళలో...! ధ్యాస దహన జ్వాలయై యద రగిలిపోయే బాధలో...! మమతలన్నీ దూరమైతే మనసు గతి ఇంకేమిటి మనసు వెతలో మలిగిపోతే మనిషి బ్రతుకింకేమిటి అవని దావానలమున దహనమైన వనమునై శిధిలమైన భవనమందున వెలుగులేని వాకిలై జీవితాన శోభలన్నీ శోకజలధిన పొరలిపోతే...! రుధిర రయము, హృదయ రవము ఆగిపోవిక ఏలనో...! బ్రతుకాగిపోదిక ఏలనో...!