Posts

Showing posts from June, 2024

Rave Na Cheliya (రావే నా చెలియా)

  కోమల కవితా తార.. ప్రేమ సుధా ధారా.ఆ..ఆ..ఆ మనోహర తార.. నా మధుర సితార... ఆ..ఆ..ఆ..ఆ... రావే నా చెలియా రావే నా చెలియా చెలియా... నా జీవన నవ మాధురి నీవే... నా జీవన నవ మాధురి నీవే.... రావే నా చెలియా.. నీ ఎల నవ్వుల పూచిన వెన్నెల... వెలుగును వేయి చందమామలై నీ ఎల నవ్వుల పూచిన వెన్నెల... వెలుగును వేయి చందమామలై... నీ చిరు గాజుల చిలిపి మ్రోతలే...ఏ.. నీ చిరు గాజుల చిలిపి మ్రోతలే... తోచును అనురాగ గీతాలై...ఈ తోచును అనురాగ గీతాలై...ఈ రావే నా చెలియా.. చెలియా.. రావే నా చెలియా నీ అందియల సందడిలోన... నా ఈ డెందము చిందులు వేయునే నీ అందియల సందడి లోన... నా ఈ డెందము చిందులు వేయునే.. నీ కను గీటులె వలపు పాటలే...ఏ..ఏ..ఏ ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ.......... నీ కను గీటులె వలపు పాటలే... నీ కడ సురలోక భోగాలే...ఏ.. నీ కడ సురలోక భోగాలే...ఏ.. రావే నా చెలియా చెలియా నా జీవన నవ మాధురి నీవే రావే.. రావే.. రావే... నా చెలియా