మార్గాలు
నీ మార్గంలో నువ్వున్నావ్!
నా మార్గంలో నేనున్నాను!
కలసి విడిపోయే మార్గాల పై
మన ప్రయాణం సాగుతోంది!
ప్రాణమిచ్చేటంత స్నేహం కాదు,
కొట్టుకునేటంత శతృత్వం లేదు!
భావ సాగర అలల మధ్య
తేలుతున్న నావలం!
ప్రశాంతంగా ఉన్నప్పుడు
ప్రక్క ప్రక్కన ప్రయాణిస్తాం!
అలలు పోటెత్తితే
తటాలుమని ఢీకొంటాం!
అయినా మనం నిమిత్తమాతృలం!
ఉత్తర దక్షిణ ధృవాల మధ్య
గుండ్రంగా తిరిగే జీవులం!
గుంపులుగా తిరిగే మనుషులం!
Comments
Post a Comment