ఆ మొగల్ రానా ధీరులు. తాంతియాటోపీ ఝాన్సీల స్వాతంత్య్ర సమరదీప్తి

 ఆ మొగల్ రానా ధీరులు. తాంతియాటోపీ ఝాన్సీల స్వాతంత్య్ర సమరదీప్తి 

త్యాగ మూర్తులు తిలక్ దాదా సి.ఆర్ దాసు మాలవ్య మన గాంధి మహిత శక్తి 

జాతీయ సంస్థ యై శాంత్యహింసలతోడ కాంగ్రెస్సు నడిపిన కదన ఫణితి 

తమిళ ఆంధ్ర కేరళ ధారుణీ ప్రజలెల్ల ధారవోసిన మహా త్యాగఫలము 

మాతృ దేశము గావ క్షాత్రవ్యుడై బోసు పాడారాని యిడుముల పడిన శ్రమయు 

పండిత నెహ్రుజీ పటేల్ పట్టాభియు రాజాజీ నెరపిన రాజ్య పటిమ 

భారతీయుల పుణ్యంబు పండెననగా వచ్చెనిదిగో సుస్వాతంత్య్ర వత్సరంబు 

భారతీయుల పుణ్యంబు పండెననగ వచ్చెనిదిగో సుస్వాతంత్య్ర వత్సరంబు 

పొత్తు గూడుచు శుభములు పొందురయ్యా తొల్లి భారత విభవంబు వెల్లివిరియా...  

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు