సమస్యా పూరణం 1


దత్తపది - 119 (అర-చెర-ధర-ముర)


"అర - చెర - ధర - ముర"


పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ


భారతార్థంలో


నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి


అరమరికలేని రుక్మిణి
మురళీధరపాణిగోరి మురిపెము కాగన్
చెరవిడిపించగవచ్చెను
వరదుడు హృదయాపహారి వరియింపంగన్

మధురన్చెరవిడి మహిమను
మధురంబుగ యదుకులంబు మాధవుడెదగన్
వధియించెను కంసునరగి
మధుమురళీధర మురారి మగధీరుండై

Comments