Naluguru Kalasi

నలుగురు కలిసీ పొరుపులు మరిచీ

చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం 

మన కిస్తుందెక్కువ ఫలసాయం

ఇది రైతులకెంతో సదుపాయం "నలుగురు"

ఒక సంసారం వందెకరాలను పండించటమే అరుదుకదా
అది భరించలేని బరువు కదా

పది కుటుంబములు వెయ్యెకరాలను
సాగు చెయ్యడం సులువు కదా "నలుగురు"

మహారాజులూ జమిందారులూ 
మచ్చుకు దొరకని కాలంలో
ఈ ప్రజలేఏ ఏలే రాజ్యంలో 
ఇతరుల కష్టం దోచుకు తినడం
ఇకపై సాగే పనికాదోయ్ 

ఇదియే సూత్రం ఒక్కడూ మాత్రం 
భూమిని గుత్తకు కొనరాదు
కడు సోమరిపోతై మనరాదు
నేలా నీరూ గాలీ వెలుగూ కొందరి సొత్తని అనరాదు
అవి అందరి హక్కై అలరారు "నలుగురు"

ఒకొక్క వ్యక్తీ, సమస్త శక్తీ ధారపోసి పనిచెయ్యాలి
ధన ధాన్యరాశులే పెంచాలి
కూటికి గుడ్డకు లోటులేక తనకవసరమైనవి పొందాలి "నలుగురు"

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు