చేనేత బతుకు బండి
నేతలార నేతలార!
రాజకీయ నేతలార!
ఏ రాట్నం వాడకుండ
ఏ నూలూ వడక కుండ
నేస్తున్నారీ సమాజ
అవినీతి భరిత వస్త్రాన్ని!!
చీకటిలో జారుతున్న
చే 'నేత' బతుకు కనపడదా?
అరిగి తరిగి ఒరిగిన
మగ్గాల ఏడ్పు వినపడదా?
ఎందుకు ఈ మౌనం!
మరి ఎందుకు ఈ జాప్యం!
గంజి పెట్టు వసత్రాలను
తొడుగుతారె గాని!
గంజినీరు తాగి బతుకు
కార్మికుల వెతలు చూడరా?
మీ మాటల నేత ఇంక
మానండోయ్ నేతగాళ్ళు!
చేనేత బతుకు బండిని
ఎక్కించండోయ్ పట్టాలు!!
Comments
Post a Comment