కవి కోకిలవై వర్ధిల్లు

నస పెట్టకు నస పెట్టకు
నీ కవితలెవరు వినరని!
గుస పెట్టకు గుస పెట్టకు
వీరంతా ఇంతేనని!
బుస కొట్టకు బుసకొట్టకు
వారెవరు కవులు కారని!
రుసరుసగా చూడకు
ఇది తగిన స్థలము కాదని!
విసవిసగా వీడకు
ఈ రోజుకింక సెలవని!

నీ కవితల వాడి పెంచు!
నీ పదముల వేడి పెంచు!
నీ స్పందన జోరు పెంచు!
నీ సహనం తీరు పెంచు!

రుసరుసలూ విసవిసలూ
కవుల కళకు కళంకాలు!
కవి కోకిలవై వర్ధిల్లు
ఇలలో పది కాలాలు!!

Comments