కోడీ మేలుకో!
ఒసేయ్ కోడి!
ఎంత వెర్రి దానివే నువ్వు!
నీకే గొప్ప టైమ్ సెన్సు ఉన్నట్లు
ప్రొద్దుటే లేచి
కొక్కొరొకో...! అని అరుస్తావు!!
మా మనుషులు చటుక్కున లేచి
నీకు థాంక్సు చెబుతారా...?
నీ అరుపు వినగానే వాళ్ళకు
నోరూరే నీ వంటకాలు గుర్తొస్తాయి.
చికెన్ బిర్యానీ, చికెన్ సిక్స్టీ ఫైవ్,
చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ, చికెన్ బర్గర్
అబ్బో ఒకటేమిటి నిన్ను వండుకు తినటానికి వందల రకాల వంటకాలు!
నీకు రోజూ దాణా వేసే
నీ యజమానిని అడుగు
నువ్వు తిని బలిసాక
వాడు నిన్ను ఏం చేస్తాడో!!
నీకన్నా ముందున్న
నీ సీనియర్ కోళ్ళు ఇప్పుడు
ఎక్కడున్నాయో తెలుసా?
ప్రమోషన్ మీద వెళ్ళాయి
ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి!!
అక్కడి నుండి వెళ్తాయి
చికెన్ ప్రియుల ప్లేటుల్లోనికి
రుచికరమైన వంటకమై!!
కోడీ! మమ్మల్ని మేల్కొలపటం కాదు!
నువ్వు మేలుకో!!
Comments
Post a Comment