మనసు వికసించదా

మనసు ముకుళించినా
మరల వికసించదా...
పూలతీవెల ఓలె హితుడా...
పున్నమి జాబిలిగ హితుడా...

ప్రియమైన బంధాలు
దూరమైనాయని
శిలగ మారెదవేల హితుడా...
మోడువారిన తరువు
మరల చిగురించదా
మనసు వెన్నగ మార్చుకోవా హితుడా...
జీవితము పండించు కోవా హితుడా...
కర్తవ్యమును తీర్చుకోవా!!

Comments