ధన్యుడనైతి

నాదు కంఠము నందు
అమ్మ శారద జేరి
తీయగా పాడేటి గుణముజేర్చె!

నాదు హృదిలోన
ఆదేవి వాగ్దేవి కొలువయ్యి
కమ్మగా కవితల్లు తెలివినిచ్చె!

నాదు మునివేళ్ళలో నిలచి
మాత చిత్రమ్ముగా
చిత్రలేఖన మందు బ్రతుకు నిచ్చె!

ధన్యుండనైతి నే  ధరణి భారతి బుట్టి
మెరుగు దిద్దుకొందు గుణములెల్ల!!

Comments