లేఖా సాహిత్యం 4 - అల్లడు మామకు
తేదీ: ఆగష్టు 10 1978
దైవ సమానులైన మామ గారికి,
మీ అల్లుడు ఆదర్శ రావు వ్రాయు శుభవార్త. మీరు త్వరలోనే తాతగారు కాబోతున్నారని తెలియ జేయుటకు సంతోషిస్తున్నాను. మా తండ్రి గారి ఉత్తరానికి మీరు చింతించ వద్దు. ఆయన పాతకాలం మనిషి. కట్నం తప్ప వేరే ఆలోచన లేదు. అది అతని హక్కుగా భావిస్తారు. మిగతా విషయాలలో అతను సాత్వీకుడే.
నేను వరకట్నానికి వ్యతిరేకిని. నేను మా తండ్రిగారికి తెలియకుండా కొంత డబ్బు దాస్తున్నాను. అవి ఈ నెలతో యాభైవేలు పూర్తి అవుతాయి. ఎలాగూ నేను మా తండ్రిగారికి ఇవవ్వలసిన ధనమే గనుక మీరు వరకట్నం నిమిత్తం నాకు బాకీ తీర్చి పంపినట్లుగా చెప్పి ఇస్తాను. అపుడు ఆయన సంతృప్తి చెందుతారు. మీ సమస్య తీరుతుంది. నా డబ్బు నా వద్దే అంటే మా తండ్రి గారి వద్దే ఉంటుంది గనుక నష్టపోయేది యేమీ ఉండదు. అందరూ సంతోషంగా ఉండవచ్చు. నా ఈ ఆలోచనను మీరు స్వాగతించవలసిందిగా మనవి.
నాది మరొక విన్నపమేమనగా... మా బావ మరిదికి మీరు వివాహం తలపెట్టినప్పుడు పైసా కట్నం తీసుకోకుండా సంబంధం కలుపుకోండి. ఇదే మీరు నా కిచ్చే బహుమానంగా భావిస్తాను.
ఇట్లు మీ అల్లుడు
ఆదర్శరావు
Comments
Post a Comment