ఏ గదిలో చూసినా

ఏ గదిలో చూసినా
ఎడమోము పెడమోమె

ఏ గదిలో చూసినా
అరచేత ఫోనులే

ఏ గదిలో చూసినా
మౌన జీవాలే

ఏ గదిలో చూసినా
మనసు మధనాలే

ఏ గదిలో చూసినా
బ్రతుకు బంధాలే

గుండె గది లోనే
కొట్లాడుతోంది
నిశ్శబ్ధ భేది యై
కొట్టుకుంటోంది

మౌనాన్ని వీడమని
మనసును పంచమని

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు