ఓ ఆత్మ బాంధవా
మనసు మలినమైంది
కడిగేందుకు రావా
ఓ ఆత్మ బాంధవా!
మనుగడ యాంత్రికమైంది
సరిచేయగ రావా
ఓ ఆత్మ బాంధవా!
మమతలు మోడైనాయి
మళ్ళీ చిగురించనీయవా
ఓ ఆత్మ బాంధవా!
మతములు మూఢమైనాయి
సత్యం ఎరిగింపవా
ఓ ఆత్మ బాంధవా!
మానవత్వం కనుమరుగైంది
మళ్ళీ అవతరించవా
ఓ ఆత్మ బాంధవా!
Comments
Post a Comment