మానస సంచార

మహాదేవ మానస సంచార!
మాయా కల్మష గరళ నివార!
పన్నగ భూషణ! పాపవిమోచన!
పరమదయాకర శరణమయా శివ!

నీలీలలు మేమెన్నగ తరమా!
నీమాయను ఛేదించగ తరమా!
నీ కృపచే మా కాయము నిల్చును!
నీ దీవెన మా ఆయువు నిల్పును!
ముజ్జగములనూ నడిపేవాడివి!
మూఢుల సద్గతి నడపగ రావా!

మహాదేవ మానస సంచార!
మాయా కల్మష గరళ నివార!
పన్నగ భూషణ! పాపవిమోచన!
పరమదయాకర శరణమయా శివ!

నిసరిమ పనిసా
రిసానిదపదమా దపమగరీ పమగరీ గనిసా

కామేశ్వరుడా! భీమేశ్వరుడా!
రామేశ్వరుడా! సోమేశ్వరుడా!
జలజటధారా చంద్రశేఖరా!
జయమివ రారా జగదాధారా
నిను కొలిచే మా వినతి యిదేరా...!
కలతలు దీర్చగ కరుణ జూపరా!

మహాదేవ మానస సంచార!
మాయా కల్మష గరళ నివార!
పన్నగ భూషణ! పాపవిమోచన!
పరమదయాకర శరణమయా శివ!

హరహర శంభో హరహర శంభో!
శంభోశంకర సాంబశివా!

హరహర శంభో హరహర శంభో!
శంభోశంకర సాంబశివా!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు