త్రిశంఖు స్వర్గం
కీబోర్డు మీద వేళ్ళు పరిగెడుచుంటే
పని వత్తిడికి మెదడంతా వేడెక్కింది
గుండెలలో మాత్రం చలి
వెన్నులో కూడా చలి
ఎసి చల్లదనంలో ...
వళ్ళంతా వణుకుతోంది
కనీ మెదడు వేడికి
చెమటలు ముఖంలోనే ఇంకిపోతున్నాయి!!
నవ్వి చాలా రోజులైనట్టుంది
ముఖంలో ఆందోళన తప్ప
ఇంకేదీ కనిపించుటలేదు!
ఇది అతను కావాలనుకున్న
ఉద్యోగమే కావచ్చు!
కానీ కోరుకున్న జీవితం కాదు!
జీతం చేతి నిండా ఉంది!
జీవితమే చేజారిపోతోంది
సాఫ్టువేర్ ఉద్యోగి బ్రతుకులో
సాఫ్టుగా కనిపించేది
వారాంతపు విశ్రమదినాలు
రెండు రోజులు!!
కానీ ఆ రెండు రోజులూ
అతనికి అశాంతి గానే
గడచిపోతాయి!!
భార్య చిరునవ్వే
అతనికి ఐదురోజుల బలం!!
నలభైలో పడ్డాక అతనికి
త్రిశంఖు స్వర్గమే!!
భవష్యత్తు పై కట్టిన
ఆశలమేడలు
నెల వాయిదాలలో
చిక్కుకు పోయి...
ఊపిరి అందనివ్వక
ఉక్కిరిబిక్కరి చేస్తాయి!!
ప్రశాంతత కోసం
పక్కదారులు వెతకలేక...
బయటపడే ధైర్యం చెయ్యలేక...
కాలప్రవాహంలో తోసుకుపోతూ...
సంతోషం నటిస్తూ...
అసంతృప్తిలో గడిపెస్తాడు!!
Comments
Post a Comment