లేఖా సాహిత్యం - 3 వియ్యంకుడు బావగారికి
తేది: ఆగష్టు 2 1978
గౌరవనీయులైన అప్పారావు బావగారికి మీ వియ్యంకుడు ఉగ్రనరసింహం వ్రాయునది.
ఉభయ కుశలోపరి అని మొదలు పెట్టే సహనం నాలో కొరవడింది! మీరు వాయదాల లెక్కని కడుతున్న కట్నం బాకీ యాభై వేలు వడ్డీకే సరిపోతోంది.
ఇక అసలు ఎప్పుడు తీరుస్తారు?
నాకా రిటైర్మెంట్ వయసు దగ్గర పడింది. ఎప్పుడు హరీ అంటానో ఆ శ్రీహరికి తప్ప నాకూ తెలీదు. మీదీ అదే పరిస్థితి అని నాకు తెలుసు. నేను వైకుంఠం చేరేలోపైనా ఆ బాకీ మీరు తీరుస్తారనే నమ్మకం నాకు కనిపించటం లేదు.
మీ అమ్మాయిని పుట్టింటికి పంపేలోపు అదేదో తీర్చే ఏర్పాటు పూర్తి చెయ్యండి.
అన్నట్టు చెప్పడం మరిచాను నా కుమారునికి వంశోధ్ధారకుడు కలగబోతున్నాడు మీ కుమార్తె దయవలన. వాడు భూమ్మీద పడే లోపు మన కట్నం బాకీ వ్యవహారాలు కాస్తా ఓ కొలిక్కి రావాలని నా సూచన. హెచ్చరిక అనుకున్నా నాకు అభ్యంతరం లేదు.
మా చెల్లెలు గారికి నా ఆశీశ్శులు
ఉంటాను.
భవదీయుడు
ఉగ్ర నరశింహ అప్పలాచార్యుడు.
Comments
Post a Comment