బాధ్యత రాదా!!
సమాజం స్థబ్ధతగా ఉంటే...
నేరస్తులు నెగ్గుకు వస్తారు!
వెలుగు వెంటాడక పోతే...
చీకటి చిందులేస్తుంది!
నాయకులే నేరం చేస్తే...
నాగరికానికి విలువేముంది!
పశువులకే పగ్గం ఇస్తే...
మానవతకు మనుగడ ఏది!
రక్కసులకు రాజ్యం ఇస్తే...
భోషాణం భోజ్యం కాదా!
విషమే విరజిమ్ముతు ఉంటే...
సుభాషిత సుమములు వాడును!
ఇల్లాలు ఇంటిని దిద్దితె...
వెలయాలికి వెలుగెక్కడిది!
క్రమశిక్షణ కలిగినచోట...
అక్రమాల అలెక్కడివి!
ధర్మకవచమే ధరిస్తే...
అధర్మం అంతరించదా!
నీతే నీ మార్గం అయితే...
అవినీతికి అడ్డు తగలవా!
దేశమె నీ దేహము అనుకుని...
బాగుసేయ బాధ్యత రాదా!!
Comments
Post a Comment