గుర్తింపు కోసం కాదు

మబ్బు నెవరు గుర్తించకున్నా
వర్షాన్నిస్తుంది!!
సూర్యుణ్ణి ఎవరు గుర్తించకున్నా
వెలుగునిస్తాడు!!
అమ్మ కష్టాన్ని ఎవరూ గుర్తించకున్నా
అన్నం వండి పెడుతుంది!!
మొక్క నెవరు గుర్తించకున్నా
పూలనిస్తుంది!!
చెట్టు నెవరు గుర్తించకున్నా
ఫలాలనిస్తుంది!!
నన్ను ఎవరూ గుర్తించక పోయినా
కవిత్వం రాస్తూనే ఉంటాను!
పాటలు పాడుతునే ఉంటాను!
నా ప్రతిభకు అద్దం నా సహనం!
నా కళలకు నేనే నిర్వచనం!!
నా సాధననుండి వెలువడే రసజ్ఞతను
ఆస్వాదించేది నేనే!!
ఆత్మ సంతృప్తికి మించిన
అమృతం లేదు!!
ఆ అమృతాన్ని నిరంతరం
తాగుతునే ఉన్నాను!!
ఆరోగ్యంగా!! ఆనందంగా!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు