డ్రగ్స్ మాఫియా

మానవ మృగాల వేటలో...
మాదకద్రవ్యాల ఆటలో...
యువత బలి అవుతోంది...
నల్లబజారులో నాట్యంచేస్తూ...
మత్తురుచి చూపిస్తూ...
డ్రగ్స్ అనే ముద్దు పేరుతో...
ముద్దులొలికే పసివాళ్ళను సైతం...
మత్తుకు బానిసలను చేస్తూ...
ధనార్జనే ధ్యేయంగా...
దుర్మార్గమే మార్గంగా...
ధనవంతుల బిడ్డలనే లక్ష్యంగా...
పిచ్చివాళ్ళను చేస్తూ...
ఉన్మాదులను చేస్తూ...
దొంగలను చేస్తూ...
హంతకులుగా మార్చేస్తూ...
బాల్యాన్ని తృంచేస్తూ...
దేశ ద్రోహుల్ని చేస్తూ...
కన్నెల జీవితాల్ని కాటేస్తూ...
విశృంఖలత్వానికి మరో రూపంగా!
రాక్షసత్వానికి మరో కెరటంగా!
చెలరేగిపోతోంది ప్రపంచ వ్యాప్తంగా!
మూలాలను గుర్తించలేక నిర్వీర్యమై
మాదక ద్రవ్యాల మాఫియా ఆకుల్ని
తెంపుతూ తృప్తి పడుతున్నాయి
దర్యాప్తు సంఘాలు!!
మనుషులు మారనినాడు
సమాజం ఎలా మారుతుంది!
మనుషులను వదిలేసి
చట్టాలును నిర్మించినా...
ఫలితం సూన్యం!
సంస్కారం మనుషులలో కలగాలి!
వ్యాపారమే జీవితమై...
స్వప్రయోజనమే పరమర్థమై...
మనిషి బ్రతుకతున్నంత కాలం...
సామాజిక చిత్రం ఇలా...
నల్ల రంగులోనే ఉంటంది!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు