ఏకో నారాయణ
ఏకో నారాయణ!
ఏకో నారాయణ!
ఏకాదశ పర్వదినాన!
ఏ కీడూ సేయమయా!
ఏ అసత్య మాడమయా!
ఏ పరుషం మాటాడమయా!
ఏ మనసూ బాధించమయా!
ఏదో ఒక మార్గాన నిను సేవిస్తామయ్యా!
ఏదో ఒక కీర్తన నీపై ఆలపిస్తామయ్యా!
ఏదో ఒక నైవేద్యం నీకందిస్తామయ్యా!
ఏకాగ్రతతోడై నీ ధ్యానం చేస్తామయ్యా!
ఏకో నారాయణ!
ఏకో నారాయణ!
Comments
Post a Comment