లేఖా సాహిత్యం 9 - హీరో కి.
మా సూపర్ హీరో
డేరింగ్ స్టార్ గారికి,
అన్నా! ఏంటిది? నవ్వు మా సూపర్ హీరోవి. నువ్వే ఇలా డ్రగ్సు లో... నమ్మలేక పోతున్నామన్నా!! ఎందుకిలా మారావ్?
నువ్వొక్కడివే ఇరవై ముఫ్ఫై మంది రౌడీలను దుమ్ము రేపి కొడవతావే... అధర్మానికీ అవినీతికి సింహ స్వప్న మైనట్లు నటిస్తావే... నువ్వేనా...!
నువ్వేనా మాదక ద్రవ్యాలకు బానిసై
భయంకరమైన నేరసామ్రాజ్యపు వలలో చిక్కి వాళ్ళ దుర్మార్గాలకు సాయం చేస్తున్నది..?
నీ సినిమాలు చూసి మేమెంతో స్ఫూర్తి పొందుతామే... అలాంటిది నువ్వే చెడిపోయి నీ తోటి నటులను కూడా చెడగొడుతున్నావా?? నమ్మలేకున్నాను అన్నా!!
ఛీ!! సిగ్గు పడుతున్నాం!! మీరు మమ్మల్ని ప్రభావితం చేసేది ఇలానా??
మీ ముసుగు తొలగిపోయింది. ఇకనైనా మారే ప్రయత్నం చెయ్యండి. నిజాల్ని దాచి దేశ ద్రోహుల్ని కాపాడే ప్రయత్నం చెయ్యకండి. ఈ ఊబినుండి మీరు బయటపడాలి! మిమ్మల్ని ఈ రొంపిలోకి లాగిన వాళ్ళకు శిక్ష పడాలి.
అదే మా అభిమానానికి మీరిచ్చే బహుమానం!! అదే తెలుగు సినిమాకు మీరిచ్చే సహకారం!! అదే ఈ దేశానికి మీరు చూపే గౌరవం!!
ఉంటాను
మీ మార్పు కోరుతూ....
మీ అభిమాని!!
Comments
Post a Comment