శాంతే ప్రగతి మార్గం

రాజ్యాలను విస్తరించుట
రాజరికపు ధర్మం నాడు!
దేశాలను అశాంతి పరచుట
దుష్ట గ్రహ నైజము నేడు!
ప్రత్యక్షయుధ్ధం సేయగ
ప్రపంచాన పనికిరాదని
ఏదోనొక వంకను జూపి
రక్తచరిత రాస్తున్నారు!
మతరాజ్యం సాధించమని
ఏ దేముడు చెప్పాడో మరి!
పరదేశపు ఎల్లలు చెరపే
ప్రయత్నాలు చేస్తున్నారు!
అమాయకుల ఊచకోతతో
అంధకాసురులౌతున్నారు!
మన ప్రగతే కంటగింపుగా...
అసూయలతొ అసహనంతో...
వేర్పాటు భావం రేపి...
కాశ్మీరం కొల్లగొట్టుటకు...
కుతంత్రాలు జేస్తున్నారు...
పొరుగుదేశ పొగరుబోతులు!!
అరుణాచలమాక్రమించుటకు...
అడ్డదారినొస్తున్నారు...
చంచలితమగు చైనామూకలు!!
శాంతి కోరి మనదేశం...
సహనం పాటించాలి!!
ద్విగుణీకృత శక్తిని పొంది...
ప్రపంచాన ఎదగాలి!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు