అవివేకం

మరణం మనకనివార్యమ్మైతే
మాధవుడేంచేస్తాడు!
అమరనాధ దర్శనమైనా
అమరలోకమేగక తప్పదు!
కమలనాధు భక్తుడివైనా
కమలాక్షుని కలవక తప్పదు!
ఉగ్రమూక దాడులనైనా...
నిద్ర నడుపు చోదకమైనా...
కొండచరియ విరుగుచు పడినా...
నీ గమనం ఆగిపోవును!
పరలోకపు గతిని చూపును!

మరణం మనకనివార్యమ్మైతే
మాధవుడేంచేస్తాడు!
అభిమన్యుని మరణం తెలిసీ
ఆదుకొనగ వచ్చాడా!
సీతమ్మకు వనముల యోగం
ఆప సాహసించాడా!
విధిరాతను విధాత కూడా
మార్చరాని మహా ధర్మము!
కర్మణ్యేవాధికారస్తే
మాఫలేషు కదాచనంటూ...
భగవంతుని బోధన విన్నా
విలపించుట మనోవికల్పం!
భగవంతుడు లేడంటూ...
నిందించుట నీ అవివేకం!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు