కార్యాచరణ
ఆదర్శం అరుపుల కాదు...
ఆచరణను ఉండాలోయ్!
ఉద్రేకం ఊసుల కాదు...
ఉద్యమాన ఉండాలోయ్!
అక్షరాలు అలికిడి కాదు...
ఆయుధమై అదిలించాలోయ్!
సమూహాల సందడి కాదు...
సంఘటితం కావాలోయ్!
సమస్యలకు సడలత కాదు...
సమరభేరి మ్రోగించాలోయ్!
నిప్పున నీరెయ్యక పోతే...
నిలువునా కాల్చెస్తుందోయ్!
పునాదులకు పగుళ్ళు వేస్తే...
భవంతులే పడిపోతాయోయ్!
నిర్మాణత నిగ్గుగ ఉంటే...
నీదేనోయ్ భావివైభవం!
సమానతే సమ్మతి అయితే...
సమాజమే శాంతిమందిరం!!
Comments
Post a Comment