ఏ పత్రికలో చూసినా

ఏ పత్రిక లో చూసినా
హింసే ప్రధమ వార్త!
ఏ పత్రికలో చూసినా
రాజకీయ అవకాశవాదమే!
ఏ పత్రికలో చూసినా
కీచక పర్వ వృత్తాంతమే!
ఏ పత్రికలో చూసినా
అవినీతి తిమింగళాల కధలే!
ఏ పత్రికలో చూసినా
రైతుల ఆత్మాహుతులే!
ఏ పత్రికలో చూసినా
దళారీ రాజకీయ స్నేహబంధమే!
ఏ పత్రికలో చూసినా
ఏదో ఒక పార్టీకి దాసోహమే!
ఏ పత్రికలో చూసినా
అర్ధ సత్యమే!
ఏ పత్రిక ప్రజాపక్షమో...
ఏ పత్రిక సమస్యలపై
సమస్య వచ్చినప్పుడు
హల్చల్ చేయక,
సమస్యకు ముందే
చైతన్యం తెస్తుందో...
అదే నిజమైన పత్రిక
దానికే కావాలి స్వేచ్ఛ!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు