తప్పుని తప్పని తప్పులెంచడం
తప్పుని తప్పులు చేస్తూ
తప్పని తప్పు లెంచడం తప్ప
తప్పుని తప్పని ఒప్పుగ
చెప్పు గొప్ప మనసు గల
వ్యక్తుల నెప్పుడు జూతునో
నప్పటికి నేనెప్పటి వలె యుందునో
దుప్పటి ముసుగేతునో
చెప్పక చెప్పలేని చప్పటి
ఈ సత్యాన్ని ఉప్ప గ
మీకందిస్తున్నాను.
చప్పున ఇక చదవండి!
తప్పక బదులీయండి!
నిప్పుల సెగలను పడక
చెప్పుడు పలుకులు వినక
ముప్పలు తిప్పలు పడక
కప్పల గోలని యనక
చిప్పలు, చెప్పులు విసరక
నన్నెప్పటివలె యాదరింతురని
నా మనవి!!
ఇందులో 26 "ప్ప" లు ఉన్నాయి.☺️
Comments
Post a Comment