మత్తు వల

మాదక ద్రవ్యాల
మాఫియా ఊబిలో
గొంతు లోతు దిగిరి
ఎందరో ఘనులు
మత్తు ఇచ్చు కిక్కు
మరిఎందు లేదని
కధానాయక మణులె
కధను నడిపేస్తుంటె
తెలుగు చిత్రసీమ
తెల్లమొహమేసింది
సులభరీతి ధనము
సముపార్జనము సేయ
నేర సామ్రాజ్యమ్ము
ఘోరకలి చేసింది
స్కూలు పిల్లల నుండి
కాలేజి కుర్రాళ్ళు
ఐటి ఉద్యోగులను
వంచనకు గురిజేసి
మత్తు వల లాగేటి
మచ్చలుగ మార్చేటి
కౄర నేరస్థులను
కఠినముగ శిక్షించి
దేశ రక్షణ జేయ
బూనవలె సర్కారు!!
దొరికె కద వార్తంచు
ఆగమాగము జేయు
మీడియా గూడ
తగు బాధ్యతను జూపవలె!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు