సంఘటితం కాక తప్పదు
పదాలు ఎన్నున్నా
అక్షరాలు కొన్నే
ఆలాపనలెన్నున్నా
స్వరాలు కొన్నే
భావాలు ఎన్ని ఉన్నా
భాషలు కొన్నే
బాధ్యతలు ఎన్నున్నా
స్వీకరించే చేతులు కొన్నే
కొన్నే ఎన్నిటినో నడిపిస్తాయి!
ఏకమే అనేకానికి
మూలమై నిలుస్తుంది!
విడివిడిగా ఉండే బిందువులు...
కలిసుంటే మహా సంద్రం!
విడిగా ఉండే ఐదువేళ్ళు...
బిగిస్తే ఉక్కు పిడికిలి!
సమస్యలు విడిపోవాలంటే
సంఘటితం కాక తప్పదు!!
సమిష్టిగా ఉంటే...
సాధించే ఫలితాలెన్నో...!!
భిన్నత్వానికి...
ఏకత్వమే పరిష్కారం!!
Comments
Post a Comment