సంపూర్ణ జీవితం
సంపూర్ణ జీవితాన్ని
నాలుగు భాగాలు చేస్తే
ప్రథమ భాగం
తలిదండృలు నడిపిస్తే...
ద్వతీయ భాగం
భార్యతో నడుస్తుంది!
బిడ్డలను నడిపిస్తుంది!
తృతీయ భాగం
బిడ్డలతో నడిస్తే...
చతుర్థ భాగం
మనమళ్ళతో గడిపేస్తుంది!
నాలుగు భాగాల ఈ జీవితం
ఏ భాగంలోనైనా ముగియవచ్చు!
జీవితాన్ని పండించుకునే వ్యక్తి
నాల్గు భాగాలనూ నాయకుడే!
బాల్య యవ్వనాలలో విద్యలో!
సహధర్మచారితో సంసారంలో!
బిడ్డలతో పోషణలో!
మనుమలతో ఆటలలో!
సమాజంలో తనవంతు పాత్రలో!
సంపూర్ణ వ్యక్తిగా నిలుస్తాడు!
Comments
Post a Comment