వ్యత్యాసం
అభిమాన హీరో సినిమా
రిలీజుకు ముందే పండగ!
అభిమానులు లేని రైతు పంటను
అంటారెందుకు దండగ?
ఆ సినిమా కలెక్షన్ల కోసం
ముందునుంచే బెట్టింగులు
ఈ పంట దిగుబడి కోసం
ఎవరు కాస్తారు పందాలు?
ఆ సినిమా బాగోకున్నా
ఆడిస్తారు యాభై రోజులు
ఈ పంట పాడైతే
ఆడతారు రైతు బ్రతుకుతో ఆటలు
ఆ సినిమా నిర్మణానికి
ఫైనాన్సియర్లు రెడీ
ఈ వ్యవసాయ సాయానికి
పెట్టుబడిదారుడు ఏడీ??
రెండు గంటల సినిమా కోసం
రెండు వందల కోట్లు!!
నూరేళ్ళ జీవితం కోసం
రాలవు కన్నీటి బొట్లు!!
Comments
Post a Comment