ఏ వీధిలో చూసినా

ఏ వీధిలో చూసినా
ఎందు కాలిడినా
మురికి గుంతలు తప్ప
ఏమి ఘనమైనవి

ఏ వీధిలో చూసినా
ఎటు తిరిగి పోయినా
కొంటె జూపులు జూచు
తుంటరి పురుషులే

ఏ వీధిలో చూసినా
ఎటువైపు జూసినా
గ్రామ సింహము లెన్నొ
ఎదురు వచ్చునులే

ఏ వీధిలో చూసినా
ఎంత యత్నించినా
చెత్త పోయు వారి
నాపడం సాధ్యమా

ఏ వీధి లో చూసినా
ఎన్ని నిందించినా
ధూమపానుల పొగల
నాపడం సాధ్యమా

ఏ వీధిలో చూసినా
ఎవరు ఎదురైనా
పలకరింపులు లేని
యాంత్రిక గమనమే

ఏ వీధిలో చూసినా
ఎట్టి కృషి జేసినా
చైతన్య హీనమే
కాన వచ్చునుగా

ఏ వీధిలో చూసినా
ఎంత వీక్షించినా
మానసిక వృధ్ధులే
స్వాగతింతురులే

ఏ వీధిలో చూసినా
ఏముంది ఏముంది
మంచి మానవతము
మంటగలిసింది

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు