శివుడా ఓ శివుడా
పల్లవిll
శివుడా ఓ శివుడా!
భవుడా శాంభవుడా!
విభూది ప్రియుడా!
త్రిశూలధరుడా!
అనంతుడా! గిరి సంచరుడా!
చరణంll
జఠాఝూటమును సవరించు!
గంగను ధరకు కదిలించు!
జఠాll
పవిత్ర జలముల ప్రవాహ ఫలమున
పాపవిమోచనమందించు !
పావన మయుడా కరుణించు!
శివుడా ఓ శివుడాll
చరణంll
మహాదేవుడా మహీతలమ్మున
మహాసారములు కుంభించు
పాడిపంటల శుభ శోభలతో
భాగ్య వసుధగా వెలిగించు
మట్టిని నమ్ముకు బ్రతికే వారికి
మణిమాగాణులు కలిగించు
శివుడా ఓ శివుడా!
భవుడా శాంభవుడా!
విభూతి ప్రియుడా!
త్రిశూల ధరుడా!
అనంతుడా! గిరి సంచరుడా!
Comments
Post a Comment