గ్రామాలు కనిపిస్తాయి
గ్రామాలు కనిపిస్తాయి
గ్రామాలు కనిపిస్తాయి
రైతుల అమాయకతను
ఆయూధంగా మలచుకుని
దోచుకుతిను రాబందులు
కాచుకు కూర్చుంటాయి
తమ కల్తీ సరుకులను
అమ్ముకోటానికి వీరికి
గ్రామాలు కనిపిస్తాయి.
ఎన్నికలే ధ్యేయంగా
కులచిచ్చును రేపటానికి
కక్షలను రగల్చటానికి
రాజకీయ అవసరాలకు
గ్రామాలు కనిపిస్తాయి!
గ్రామాలు కనిపిస్తాయి!
నగరాలలో వ్యాపారాలకు
దళారీ ముసుగున చేరి
అడ్డగోలు ధరలను కట్టి
గిడ్డంగులు గుప్పిట పెట్టి
వ్యవసాయ కష్టం దోచేందుకు
గ్రామాలు కనిపిస్తాయి!
గ్రామాలు కనిపిస్తాయి!
నిరాటంక విద్యుత్ అంటూ
గొప్పలెన్నో చెప్పుకుంటూ
పరిశ్రమలకు పచ్చని పొలాలను
కబళించాలని చూస్తారు
వారి ధన యజ్ఞం, జల యజ్ఞం
కోసం గ్రామ సీమలు కనిపిస్తాయి.
అడుగడునా బోరుబావులు
నోళ్ళు తెరచి మింగుతు ఉంటే
నీళ్ళు నమిలి కూర్చుంటారు
సమస్యకు ముగింపు చెప్పరు
అప్పుడు గ్రామాలు కనిపించవు!!
ఆసలు గ్రామాలే కనిపించవు!!
ఆదర్శ రైతులెందరో
ఋణభారం భరించలేక
ఉరి కొయ్యల శరణు వేడితే
చావులు లెక్కిస్తారు.
గత ప్రభుత్వ నిర్వాకం అంటూ
ఆవేశపడి నిందిస్తారు
అపుడు వారికి
గ్రామాలు కనిపించవు
అసెంబ్లీకి దారులు తప్ప
Comments
Post a Comment