నేల తడిపాయి

నేను రాల్చిన చెమట చుక్కలు నీరులై
ఈ నేల తడిపాయి

గుండెలవిసిన రైతు కన్నుల నీళ్ళు సెగలై
ఈ నేల తడిపాయి

మట్టికోసం మరణకాండలు రక్త నదులై
ఈ నేల తడిపాయి

వాడి ఒరిగిన చెట్లు మొక్కలు పసరులై
ఈ నేల తడిపాయి

చెమటనీరు, కంటినీరు, రక్తనదులు, ఆకు పసరులు ఆవిరై
'మోహన్'

నింగికెగయుచు నీలిమేఘపు ఝల్లులై
ఈ నేల తడిపాయి

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు