ఏడవకండేడవకండీ
భరతమాత బిడ్డలార
భావి తరపు పౌరులార
ఏడవకండేడవకండి!
పుస్తకాల బరువు చూసి
ఫీజుల గుంజుడులు చూసి
ఏడవకండేడవకండి!
తెలుగు తీపి వదిలేసిన
ఆంగ్ల విద్య రుద్దేసిన
ఏడవకండేడవకండీ!
రేంకులతో రేటింగుతో
పబ్లిసిటీ స్టంటు జేసి
డొల్లచదువు జెప్పేటి
ప్రైవేటు స్కూళ్ళు
గేట్లు తెరిచె
ఏడవకండేడవకండీ!
మీ స్వేఛ్ఛకు సంకెళ్ళై
మీ వయసుకు బంధాలై
మీ మెదడులు పిసికి పిసికి
మీ తెలివిని పిండి పిండి
మీ నవ్వులు హరించేసి
మీ సందడి హటం జేసి
మీ పెద్దల భయపెట్టి
మీ బుద్ధికి గురి పెట్టి
రేపటి యంత్రాల బ్రతుకు
నేటినుండి రడీ చేయు
కాన్మెంటు స్కూళ్ళు
గేట్లు తెరిచె
ఏడవకండేడవకండి!
చదువు తప్ప గతి లేదని
చదవకుంటె చెడతావని
బతుకంతా చదువేనని
ఏడవకండేడవకండీ!
మీ కంటి నీరు చూడలేని
దౌర్భాగ్యపు కవులము
ఓదార్పు మాటలే తప్ప
ఓర్పు నింప లేము
భరించండి భరించండి
బ్రతుకంతా భరించండి
అంతులేని చదువులతో
అర్ధమవని చదువులతో
అరగదీయు చదువులతో
భరించండి భరించండి
ఏడవకండేడవకండీ!!
Comments
Post a Comment