మా పాఠశాల
పసి తనంలోన
ఇల్లే మా పాఠశాల
తల్లే మా ప్రధమ గురువు
రెండేళ్ళు దాటాక
అక్షరాభ్యాసం జరిగి
తొలి అడుగు పడింది
మా పాఠశాల
పలకా బలపములే
అక్షరజ్యోతులకు
తొలి సాధనాలై
అ అంటే అమ్మ అని
తొలి పదము నేర్పెను
మా పాఠశాల
అచ్చులు, హల్లులు
గుణింతములు తొలుత
దిద్దించి నేర్పారు
మా పాఠశాల
అంకెలు, ఎక్కములు
బట్టీయం పట్టించి
గుణకారములు నేర్పె
మా పాఠశాల
వేమన శతకమును
సుమతీ శతకమును
పలికించి వినిపించె
మా పాఠశాల
దేశ భక్తిని పెంచు
ఆట పాటల యందు
అలరించి నడిపారు
మా పాఠశాల
ఐదవ తరగతిన
అంగ్రేజి భాషలో
నాలుగు బడులిచ్చె
మా పాఠశాల
పై తరగతులలోన
సైన్సు, సోషలు, చరిత
గణితముల యందునూ
భాషపై పట్టునూ ఇచ్చె
మా పాఠశాల
మరువగలమా ఎన్నొ
మధురాను భూతులు
మాస్టర్ల పాఠాలు,
పిక్కపాశములన్ని
జెండా పండగన
జేజేలు పలుకుతూ
స్వాతంత్ర్య యోధులను
కీర్తించు రోజులు
మరువగలమా ఇంక
మా పాఠశాలను
ప్రాణమున్నంత వరకూ!
ధ్యానమున్నంత వరకూ!
Comments
Post a Comment