యవ్వనంలో వార్థక్యం
నడక నెమ్మదై
అలసట పెరిగి
శ్వాస బరువై
నిస్సహాయతతో
కూలబడుతున్న
నడి వయసు
ముసలితనం
నేటి జాతీయ సమస్య
ఈ సమస్య కు
వ్యక్తి తప్పిదం కొంతైతే
వ్యవస్థ తప్పిదం కొండంత
కల్తీ ఎరువుల వాడకం
ఘాటైన రసాయనాలు
కృత్రిమ బియ్యం
కల్తీ పాలూ, నూనెలూ
పరిశ్రమల వ్యర్థాలతో
కలిసిన గాలీ నీరూ...
విష వలయంలో
చిక్కుకున్న చేపలం మనం
స్వార్థానికి పరాకాష్టగా
జరుగుతున్న వికృత క్రీడలో
యవ్వనంలో...
వార్ధక్య బాధితులం మనం
అలసిపోయిన శరీరాలతో
అడగులేసుకుంటూ
డాక్టర్లు రాసే మందులు
వాడుకుంటూ...
పదికాలాలు బ్రతికేద్దామనే
ఆశావాదులం!!
Comments
Post a Comment