అడవి ఘనత

ప్రాణములను నిలుపు ప్రాధమికమ్ములు
జంతు జాతి కెల్ల జయము గూర్పు
చెట్ల నేల నీవు చెడనరుకుతావు
చేటు నింత భువికి చేతు వేల

పండుఫలములిచ్చు పచ్చదనమునిచ్చు
నీవు సేద దీర నీడ నిచ్చు
గాలినీరులిచ్చి గాచుటనెరిగేటి
వనములిలను మనకు వరము గాదె

ఇలకు గొడుగు వోలె యింపుగ యగుపించు
నడవు లెంత ఘనమొ నవనిలోన
వసుధ కట్టుచీర వలెనగుపించును
పచ్చ రంగు కంచి పట్టు వలెను

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు