నేను సహనమూర్తిని కాను
నేను కూల్ డ్రింకును కాదు!
చల్లగా తాగెయ్యటానికి
నేను వేడి చాయ్ ని కాదు!
స్లోగా సిప్ చెయ్యడానికి
నేను పెంట కుప్పను కాను!
వ్యర్థాలతో నింపెయ్యటానికి
నన్ను నువ్వు భద్రంగా
నిలుపు కుంటే
నేను నిన్ను మననిస్తా!
నాకు కనికరం లేదు!
వీడూ వాడూ తేడాలేదు!
నా ధర్మం నేను చేస్తా!
నాకు తేడా అనిపిస్తే
ఎంతటి వినాశనమైనా చేస్తా!
నన్ను అర్థం చేసుకోటానికి
నువ్వు నిఘంటువులు
వెతక నఖ్ఖర్లేదు
అర్థం కానంత మాత్రాన
తేలికగా తీసుకోకు!
నా శాంతం నీకు
హాయిగా కనిపించినా
నా కోపం నీకు
ప్రళయాన్ని చూబిస్తుంది!
ఇకపై నువ్వు ఏం చేసినా
ప్రకృతిని నేనున్నాని గుర్తించు!
నేను సహనం కోల్పోనంత వరకే
నీ ఆటలు సాగుతాయి!
నా ఆగ్రహం కట్టలు తెగితే
ఊహించటానికి కూడా
నీ ఉనికి ఉండదు!!
Comments
Post a Comment