తేయాకూ తేయాకూ
తేయాకూ! తేయాకూ!
నీతోనె వచ్చె చీకాకు
నిను తాగిన నాటి నుండి
వదలలేని వ్యసనంలా...
ప్రతి ఇంట నీకు ఒక డబ్బా!
ప్రతి వీధిన ఒక టీ డబ్బా!
బ్లేక్ టీ, మిల్క్ టీ
స్ట్రాంగు టీ, సాఫ్టు టీ
లెమన్ టీ, గ్రీన్ టీ
ఛిల్డ్ టీ, గోల్డుటీ
ఎన్నెన్నో రకాలు!
ఎన్నెన్నో బ్రాండులు!
బ్రాండు పేర కల్తీలు!
నిను మరిగిన మా నాలుక
ధరలసలే చూడదిక!
ఔషధాలు మరువగలం
నీ సేవనమును మానలేము
చక్కెర రోగులు సైతం
చంపుకోని చపలత్వం!
నువ్వు మాకు అందించిన
అనుభవాల అంధత్వం!!
Comments
Post a Comment