కవన భువనమందు - పద్యాలు

కవన భువన మందు కలలశోభితమైన
కవుల కేతనంబు కాంతులరయ
గగన వీధినెగిరె ఘనతెంతొ చాటుచు
తెలుగు తేజరిల్లు తెలివి మనది

రాశి కన్న వాసి రచనలు సేయగ
సాటి మేటి కవులు సంగమించె
నక్షరాల తోటి నవరస భరితమై
సత్రయాగమందు సామమించె

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు