గోవధ

గోవుపాలుతాగి గోవధ జేతుర
గోవు మాత చేయు గోడు వినర
తల్లి పాలు తాగి తలదీయ జూతుర
మానవత్వమున్న మనుజులార

గోవుచేయుమేలు గోవధ చేయున
బుద్ధి జీవులార భూమి యందు
సాధు జంతువులను సంహరణ జేతుర
సావు బాధ తమకు సరసమౌన

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు