కలుషితం

కలుషితం! కలుషితం!
కన్నీళ్ళు కూడ కలుషితం!
కరడు గట్టు గుండెలలో
అణువణువూ కలుషితం!
ఓదార్పొక కలుషితం!
ఓర్పు కూడ కలుషితం!
మాటాడే పెదవులపై
మాట కూడ కలుషితం!
పలుకరించు మోమున
చిరునవ్వు కూడ కలుషితం!
భుజం తట్టు చేయి చేయు
స్పర్శ కూడ కలుషితం!
విద్యాలయాలు కలుషితం!
విద్యార్థులలో కలుషితం!
వైద్యాలయాలు కలుషితం!
వైద్యంలో కలుషితం!
తినే తిండి కలుషితం!
తాగు జలం కలుషితం!
అటూ ఇటూ ఇటూ అటూ
కామన్ గా ఉన్నదంత
కలుషిత విష కాసారం!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు