పాలించవా పరమేశా
పల్లవిll
పాలించవా పరమేశా
మొరలాలించవా జగదీశా
ఈశా మహేశా! మహాపాప నాశా!
కైలాస గిరీశ! నమో చిద్విలాస!
పాలించవాll
చరణంll
పసికందుగా ఈ భువిచేరినాము
పరమాత్మ నీవని విని నమ్మినాము
నీ లింగ రూపమునాలింగనము జేసి
హృదయాంతరంగమున నిను
కొలచినాము!!
పాలించవాll
చరణంll
ప్రణవ నాదములోన ప్రభవించు నీవు
అఖిల లోకమునంత అలరించునీవు
ఏరూపు ధరియించి ఏలీల చేయుదువొ
ఏతీరు నటియించి తరియింప జేతువొ
పాలించవా పరమేశా!
మొరలాలించవా జగదీశా!
ఈశా మహేశా! మహాపాప నాశా!
కైలాస గిరీశ! నమో చిద్విలాస!
Comments
Post a Comment