నేటి నేపద్య గాన సంగీతం

నేపద్యగాన సంగీతం
జనజీవితాన ఒక భాగం!
పనిచేస్తూ పాడుకునే
రోజులిపుడు పోయాయి!
పనిచేస్తూ ఆలకించు
హెడ్డు ఫోనులొచ్చాయి!
సాహిత్యం వినిపించని
సౌండు ఉండు బేగ్రౌండు!
ఎవరు పిలిచినా పలుకరు!
వారి పనిలొ వారుందురు!
పాట రిధిమ్ అనుసరించి
ఊగిపోతు ఉందురు!
అలసట వచ్చేవరకూ...
చెమటలు చిందేవరకూ...
డిజె లలోన వేసెదరు
అర్థంకాని చిందులు!
వీరిపేర తెరిచినారు
మన్పసందు పబ్బులు!
డిస్కోలతొ వెలసినాయి
తాగుబోతు క్లబ్బులు!
శాస్త్రీయ గాన సంగీతం
వీరికి ఒక విషాదం!!
సాహిత్య గాన సంగీతం
మరచిందీ వినోదం!!
ఉద్వేగం! ఉత్సాహం!
ఉల్లాసం! ఉన్మాదం!
ఫాస్టు బీటు సంగీతం!
ర్యాక్ డాన్సు సంగీతం!
బ్రేక్ డాన్సు సంగీతం!
కుదురు లేని సంగీతం!
బెదురు లేని సంగీతం!
అదుపు లేని సంగీతం!
నేటి నేపద్యపు సంగీతం!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు