చీకటి
చీకటిలో నీడలను
వెలుగు ఎంత వికృతంగా
చూబిస్తోందో చూసావా!
అందుకే నాకు చీకటంటే భయం!
చీకటి దారులంటే భయం!
నా చుట్టూ వెలుగు ఉండేలా
అనుక్షణం చూసుకుంటాను!
అయినా చీకటి తరుముతూనే ఉంది!
వెలుగు తగ్గిన సమయంలో
నన్ను అంధుడ్ని చేసెయ్యటానికి!
అంధకారంలో పడిన నన్ను
అగాధాలలోకి తోసెయ్యడానికి
చీకటి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది!
వెలుతురు లేని దారు లుంటే
వెనకడుగు వేస్తూనే ఉన్నాను!
అయినా చీకటి తెరలు వెలుతురును
ఆపుతునే ఉన్నాయి....
ఓపికతో ఆ తెరలను చింపుతున్నాను!
వెలతురు దూరని గదులను
ధ్వంసం చేస్తున్నాను!!
Comments
Post a Comment