విమర్శ
వాత్సల్యంతో నీవారి
లోపాలను వెనకేసుకు రాకు!
ఆ వాత్సలయం వారి ప్రగతికి
అవరోధమై నిలుస్తుంది!
విమర్శ సదుద్దేశంతో
ఒకరు చేసినప్పుడు
దానికి కలతజెంది
ఎదురు దాడిచేయకు!
అది మరే సలహాలను
అతనికి చేరనీయదు!
కళ లో నైనా, విద్యల నైనా
వృత్తి వ్యాపారాలలో నైనా
రాజకీయాలనైనా
మరి ఏ రంగమైనా
మంచి సలహాలను గౌరవించు!
వ్యతిరేకివై స్పందిస్తే
అభివృద్ధికి అడ్డమై నిలిచినట్టే!
విమర్శించే వారి
సమర్ధతను కొలవకు!
ఒక చిత్రం నచ్చిందో
లేదో చెప్పేందుకు
విమర్శకుడు చిత్రకారుడు
కానక్కరలేదు!
ఒక పాట హాయిగా ఉందో
లేదో చెప్పటానికి
వినేవాడు గాయకుడు
కానక్కరలేదు!
కవిత్వం కటువుగా
ధ్వనిస్తున్నప్పుడు
ఖండించడం తప్పు కాదు!
గాత్రం శృతిలో లేనప్పుడు
తెలియజేయటం తప్పుకాదు!
విమర్శ కళాకారుడికి
ఒక అవసరం
దానిని అతని నుండి
దూరం చెయ్యకు!!
సమర్ధుడి సలహా
ఎంత అవసరమో!
అసమర్ధుడి విమర్శ
కూడా అంతే అవసరం!
ఒక తాగుబోతు విమర్శకు కూడా
రాముడు విలువిచ్చాడు అందుకే!!
Comments
Post a Comment