ఆదిత్యుడు పద్యాలు
ఆటవెలదిll
రధము కాంతులీనె రధికుడు రవిరాజు
సప్తవర్ణధారి సమయ లయుడు
సాగు భూములందు సంపదలు కురిపించు
సకలప్రాణకోటి విభుడు వాడు
ఆటవెలదిll
బాలభస్కరుండు బంగరు కిరణుడై
పూజలందుకొనెను పుణ్య జగతి
నాలయంబులందు నాదిత్యహృదయుడై
సేవలందుకొనెను సూర్యలయుడు
ఆటవెలదిll
జనులు తర్పణములు జగదీశు కీయగ
సంజెకాలవిధులు సందడించె
విరులు విరిసె నీట వికసించె కలువలు
దివ్య శోభ లద్దె దినము భువిని
Comments
Post a Comment