రెక్కలు
వలలో
పడ్డ చేప
గిలగలా
కొట్టుకుంటే...
ప్రణయం కాదది
ప్రళయం!
బాగా తిని
జీర్ణం కాక
తిన్నదంతా
కక్కింది...
ఆ పక్షి ఇపుడు
జైలు పక్షి!
స్కూల్లో
నాటిన మొక్కలు
యూనివర్సిటీ వరకూ
వేళ్ళూని...
ఇప్పుడు
ఫలాల నిస్తున్నాయి!
భక్తి తో
భజన చేసి
పాదాభివందనం
చేస్తే గాని...
ప్రసాదం దక్కదు
నాయకులకి
Comments
Post a Comment